లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యుల్ (JDS) నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 16న గన్నికాడలోని తన ఫామ్‌హౌస్‌లో సూరజ్ తనను లైంగికంగా వేధించాడని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అయితే తన నుంచి రూ.5 కోట్లు దోపిడీ చేసేందుకు సదరు వ్యక్తి తప్పుడు ఫిర్యాదు చేశారని సూరజ్ ఆరోపించారు.