టాలీవుడ్ హీరో బాలకృష్ణకు పద్మభూషన్ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. దేశం గర్వించదగిన బిడ్డ బాలయ్య అని కొనియాడారు. బాలకృష్ణ, భువనేశ్వరిల మధ్య నలిగిపోతున్నాను అని చెప్పి నవ్వులు పూయించారు. బాలయ్య పద్మభూషణుడు అయినదానికి చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.