TG: షావర్మా, ఫ్రైడ్ చికెన్, పిజ్జాలపై ఎంతో ఇష్టంగా వేసుకుని తినే మెయనైస్ ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బ్యాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పచ్చి గుడ్లతో తయారుచేసే మెయనైస్ వల్ల ఈ ఏడాది హైదరాబాద్‌లో 10 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మెయనైస్‌లో హానికరమైన సూక్ష్మక్రిములు ఉన్నాయని, వాటిని నిషేధించాలని కోరారు. కాగా ఇప్పటికే మెయనైస్‌పై కేరళ సర్కారు నిషేధం విధించింది.