నిజానికి చింత ఆకులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వీటిలో ఉండే పాలీఫైనాల్స్, ఫ్లేవనాయిడ్స్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. చింత ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.