కోవిడ్ బారి నుంచి అమెరికా ప్రెసిడెండ్ జో బైడెన్ వేగంగా కోలుకుంటున్నారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు హెల్త్ బులెటిన్‌ను శ్వేతసౌధం అధికారులు విడుదల చేశారు. కోవిడ్ కారణంగా తేలికపాటి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తినట్లు వెల్లడించాయి. కాగా.. అమెరికా అధ్యక్షుడికి ప్రస్తుతం జ్వరం లేదని ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.