పాకిస్థాన్‌ జట్టుకు భారీ షాక్

78చూసినవారు
పాకిస్థాన్‌ జట్టుకు భారీ షాక్
పాకిస్థాన్‌ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) జట్టు సభ్యులందరికీ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించింది. అంతేకాకుండా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌‌లో 5 పాయింట్లను తగ్గించింది. న్యూలాండ్స్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా పాకిస్థాన్‌‌కి ఐసీసీ ఈ జరిమానా విధించింది. మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి పాకిస్థాన్‌ జట్టు ఐదు ఓవర్లు తక్కువగా వేసినట్లు తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్