ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేపూర్‌లోని దర్బేషాబాద్ గ్రామం సమీపంలో బైక్‌ను వేగంగా వచ్చిన స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువకుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.