కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మంగళూరులోని కిన్నిగోలి ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో రోడ్డుపై అడ్డంగా కారు ఉండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.