బ్రిటన్ రాజుకు చేదు అనుభవం (వీడియో)
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3కు ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో షాక్ ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడటం పూర్తయిన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘మా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దోచుకొన్నవి వాపస్ ఇవ్వండి. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజూ కాదు’’ అని ఆమె నినాదాలు చేశారు.