బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమి దూరమయ్యాడు. ‘ఆస్ట్రేలియా పర్యటనకు ఆయన వెళ్లట్లేదు’ అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. BGTలో చివరి రెండు టెస్టుల కోసం షమిని ఎంపిక చేస్తారని వార్తలొచ్చాయి. అయితే, షమి పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌తో లేడని బీసీసీఐ మెడికల్ టీమ్ తేల్చింది. ఈ క్రమంలో ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టులకు అతడిని పరిగణనలోకి తీసుకోవడం లేదని బీసీసీఐ ప్రకటించింది.