నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదానికి బ్రేక్ పడింది. ఆస్తుల వివాదం, మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన ఘటనపై రాచకొండ కమిషనరేట్‌లో మనోజ్, విష్ణుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి గొడవలు చేయొద్దని సూచించారు. రూ.లక్ష చొప్పున బాండ్లను తీసుకున్నారు. దీంతో ఈ వివాదంపై మంచు మనోజ్ సైలెంట్ అయ్యారు. తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను బుధవారం సాయంత్రమే ఇంటికి పంపివేశారు. గురువారం ఉదయాన్నే మనోజ్ సినిమా షూటింగ్‌కు వెళ్లిపోయారు.