పార్టీ మారనున్న BRS ఎమ్మెల్యే.. క్లారిటీ

67164చూసినవారు
పార్టీ మారనున్న BRS ఎమ్మెల్యే.. క్లారిటీ
తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలపై అసిఫాబాద్ BRS ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం BRSలోనే కొనసాగుతానని అన్నారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని మంత్రి ఉత్తమ్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్