టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్‌కి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) షాకిచ్చింది. పార్టీ జెండాపై తమ పార్టీ గుర్తు అయిన ఏనుగు గుర్తును ముద్రించారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఏనుగు బీఎస్పీ పార్టీ జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తున్నందున విజయ్ పార్టీ జెండాపై ఉన్న ఏనుగు గుర్తు తొలగించాలని డిమాండ్ చేసింది. కాగా, తమిళనాడు వెట్రి కజగం పేరుతో పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్ ఇటీవల పార్టీ జెండాను, పార్టీ పాటను పరిచయం చేశారు.