కేంద్ర బడ్జెట్‌పై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు పూర్తయ్యింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈనెల 23న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించబోతున్నారు నిర్మలా సీతారామన్.