కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి

5603చూసినవారు
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృతి
పంజాబ్‌‌లోని భటిండా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం, వంతెనపై రెయిలింగ్ ను ఢీకొనడంతో బస్సు కాలువలో పడిపోయిందన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్