RTI కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేం : SBI

73చూసినవారు
RTI కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వలేం : SBI
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమాచార హక్కు చట్టం (RTI) కింద బహిర్గతం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిరాకరించింది. ఇది వ్యక్తిగత సమాచారం కావడం, నమ్మకస్తుని హోదా పరిధిలోకి రావడమే ఇందుకు కారణమని పేర్కొంది. సంబంధిత రికార్డులు ఎన్నికల సంఘం వెబ్ సైట్ అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ RTI కింద ఈ వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

ట్యాగ్స్ :