సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా.. అంతా ఫేక్

53చూసినవారు
సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా.. అంతా ఫేక్
సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా అంటూ వచ్చిన వార్తపై సీబీఎస్ఈ బోర్డు స్పందించింది. రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని బోర్డు నిర్ణయం తీసుకుందని, పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామంటూ సీబీఎస్‌ఈ బోర్డు పేరిట ఓ నకిలీ లేఖ హల్‌చల్‌ చేస్తోంది. అలాంటి సమాచారాన్ని నమ్మొద్దని అధికారిక ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేసింది. ’ఆ లేఖ నకిలీది. అలాంటి నిర్ణయం ఏదీ బోర్డు తీసుకోలేదు’’ అని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you