వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి రాకపై సర్వత్రా హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈసందర్భంగా భారత్‌లో పలువురు కేంద్రమంత్రులు వ్యోమగాములకు వెల్‌కమ్ చెబుతూ పోస్ట్‌లు చేశారు.‘సునీత అద్భుత ప్రయాణం, అచంచలమైన అంకిత భావం, ధైర్యం, పోరాట పటిమ.. పలువురికి స్ఫూర్తిదాయకం’ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘భారత పుత్రిక రాకను యావత్ ప్రపంచం వేడుకగా చేసుకుంటోంది’ అని జితేంద్ర సింగ్ అన్నారు.