కేబినెట్‌పై చంద్రబాబు కసరత్తు

68చూసినవారు
కేబినెట్‌పై చంద్రబాబు కసరత్తు
ఈ నెల 12న ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేయనున్నారు. జిల్లాల వారీగా ఎవరెవరికి అవకాశం కల్పించాలనేదానిపై ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. అనుభవం, వివిధ సామాజికవర్గాలకు ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు.