VIDEO: ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు

555చూసినవారు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడి గాదె రామయ్య, సీతారావమ్మ మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం నంబరు 16లో చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేశ్‌, కోడలు నారా బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.