NCERT కొత్తగా తీసుకొచ్చిన 6వ తరగతి సాంఘిక, విజ్ఞానశాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రీనిచ్ రేఖ కంటే ముందుగానే భారత్ కు సొంతంగా ప్రధాన మధ్య రేఖ ఉందని, MPలోని ఉజ్జయిని మీదుగా వెళ్లే దీన్ని 'మధ్య రేఖ' అంటారని పేర్కొంది. కులవివక్ష ప్రస్తావన లేకపోవడం, బీఆర్ అంబేద్కర్ అనుభవించిన వివక్ష అంశాల్లో సర్దుబాట్లు, హరప్పా నాగరికతను 'సింధు సరస్వతి'గా పేర్కొనడం వంటి మార్పులు జరిగాయి.