చైనా- తైవాన్ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తమను లక్ష్యంగా చేసుకుని చైనా ఒకే రోజు 125 సైనిక విమానాలతో విన్యాసాలు నిర్వహించిందని తైవాన్ ఆరోపించింది. అయితే, ద్వీప దేశంలో వేర్పాటువాద శక్తులకు కఠిన హెచ్చరికగానే కసరత్తులు చేపట్టినట్లు డ్రాగన్ వెల్లడించింది.