అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం..?

540చూసినవారు
అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం..?
నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే అలీ వైసీపీకి రాజీనామా వెనుక సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి హస్తం ఉందనే రూమర్ తెర మీదకు వచ్చింది. ఆ వ్యక్తి ఇచ్చిన సూచనతోనే అలీ వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో సినిమా వాళ్లను జగన్ ఘోరంగా అవమానించారని విషయాన్ని గుర్తు చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని ఆ వ్యక్తి ఇచ్చిన సలహాతోనే అలీ వైసీపీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్