న్యాయప్రక్రియపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన ప్రత్యేక లోక్‌అదాలత్ వారోత్సవాల కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజలు సెటిల్మెంట్‌లు కోరుకుంటున్నారన్నారు. జడ్జిలకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని అభిప్రాయపడ్డారు.