హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

61చూసినవారు
హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
హాస్టల్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ మరో విద్యార్థి ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్‌లో వెంకట్ అనే విద్యార్థికి ఇతర విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. దీంతో వెంకట్ ను ఐదుగురు విద్యార్థులు కలిసి హతమార్చినట్లు తెలుస్తోంది. వీరి మధ్య చదువుకునే విషయంలో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా వార్డెన్ లేకపోవడంతోనే ఇలా జరిగినట్లుగా తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్