హర్యానాను వాయు కాలుష్యం వణికిస్తోంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం 5వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. కేవలం ఆన్‌లైన్ తరగతులు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లకు లేఖ రాసింది. హర్యానాలోని ఎనిమిది నగరాల్లో ఏక్యూఐ దారుణంగా ఉంది.