పదేళ్లు రేవంతే సీఎం: మంత్రి కోమటిరెడ్డి

70చూసినవారు
పదేళ్లు రేవంతే సీఎం: మంత్రి కోమటిరెడ్డి
రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ శిందేలు ఎవరూ లేరని.. తామంతా రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నట్లు చెప్పారు. మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని విమర్శించారు. హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. BRS ఒక్క ఎంపీ సీటు గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధమేనని సవాల్‌ విసిరారు.

సంబంధిత పోస్ట్