గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు.. కానీ ఇప్పటి కలెక్టర్లు ఏసీ రూముల్లోంచే బయటకు రావడం లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. "అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువ కాలం గుర్తుంటారు. ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలి." అని అన్నారు.