ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర జలాశయంలో నీరు రోజురోజుకు రంగుమారుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో అల్పపీడనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ కలుషిత నీటి వల్ల రబీలో పంటలు ఎక్కడ దెబ్బతింటాయో అని ఆందోళన చెందుతున్నారు. హరప్పనహళ్లి, హగరి బొమ్మనళ్లి, తదితర ప్రాంతాల్లోని కర్మాగారాలు వ్యర్థాలను జలాశయంలోకి వదులుతుండటం వల్ల నీరు కలుషితమవుతుందని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.