తెలంగాణ సదరన్ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో పని చేసే అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఆ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. ఈ మేరకు అవినీతి ఫిర్యాదులు స్వీకరించడానికి సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. లంచం అడిగితే 040 - 23454884 లేదా 7680901912 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారం మేరకు ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు.