మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ నేత అలంగీర్‌ ఆలం

50చూసినవారు
మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ నేత అలంగీర్‌ ఆలం
మనీలాండరింగ్‌ కేసులో గత నెలలో అరెస్టయిన జార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేత ఆలంగీర్‌ ఆలం ఈ రోజు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే జార్ఖండ్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ పక్షనేత పదవికి కూడా ఆయన రాజీనామా సమర్పించారు. అలంగీర్‌ ఆలం రాజీనామా చేసిన విషయాన్ని జార్ఖండ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజేశ్‌ ఠాకూర్‌ ధృవీకరించారు. ఆలంగీర్‌ నుంచి అన్ని మంత్రి పదవులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంపాయి సోరెన్‌ తీసుకున్నారు.

ట్యాగ్స్ :