పోటీకి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి నిరాకరణ

83చూసినవారు
పోటీకి కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి నిరాకరణ
ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. నిధుల కొరత కారణంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. తన నిర్ణయానికి పార్టీ అధిష్టానానికి ఆమె తెలియజేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు ఆమె మెయిల్ పంపించారు. పార్టీ నిధులు లేకుండా ప్రచారం సాధ్యం కాదని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్