అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ప్రీమియర్ షో ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ‘ది అప్రెంటిస్’ పేరిట వచ్చిన ఈ చిత్రంలో 1970, 1980లలో ట్రంప్ అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో ఎలా ఎదిగారో చూపించారు. అయితే.. తన మొదటి భార్య ఇవానాను ట్రంప్ అత్యాచారం చేసినట్లుగా చూపడం వివాదాస్పదమైంది. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని ఆయన తరఫువారు వెల్లడించారు.