

పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్పీ రత్న కౌంటర్ (వీడియో)
AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై తాజాగా ఎస్పీ రత్న స్పందించారు. మాకు పోలీస్ యూనిఫాం ఒకరు ఇచ్చింది కాదు కష్టపడి సాధించుకున్నామన్నారు. ఒకవేళ మేం తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అంటూ పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా వీవీఐపీలకు భద్రత కల్పించామని, హెలిప్యాడ్ వద్ద కొంతమంది చాపర్ డోర్ లాగడంతో అది దెబ్బతిందన్నారు.