ఢిల్లీలో మోహిందర్ సింగ్, దిల్జీత్ కౌర్ అనే దంపతులు హత్యకు గురయ్యారు. ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ వెళ్లి చూడగా ఇంట్లో శవాలుగా పడి ఉన్నారు. దీంతో డ్రైవర్ వారి పిల్లలకు సమాచారం అందించగా.. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు భర్తను గొంతు కోసి చంపినట్లు, భార్యను రాడుతో కొట్టి చంపినట్లు తెలిపారు. అయితే మూడు రోజుల క్రితం పనిలో చేరిన కేర్‌టేకర్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.