TG: సుదీర్ఘ వాదనలు అనంతరం హైకోర్టు బన్నీకి నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సొంత పూచీకత్తు సమర్పించాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని, తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. కాగా ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అర్నబ్ గోస్వామికి బాంబే హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, ఆ తీర్పు ఆధారంగా బెయిల్ ఇవ్వాలన్న అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.