కేరళకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సిపిఐ (ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎం లారెన్స్ (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో సుమారు నెల రోజులుగా ఆయన చికిత్స పొందుతూ శనివారం ఉదయం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సీపీఐఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడిగా, ఎర్నాకులం జిల్లా కార్యదర్శిగా, లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్‌గా, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.