క్రైమ్‌సీన్ రీక్రియేషన్.. సైఫ్ ఇంటికి నిందితుడిని తీసుకొచ్చిన పోలీసులు

58చూసినవారు
యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ను ఇవాళ వేకువజామున అతడి ఇంటి వద్దకు తీసుకొచ్చారు. క్రైమ్ సీక్వెన్స్‌లో భాగంగా అంతకు ముందే నేషనల్ కాలేజ్ బస్టాప్, బాంద్రా రైల్వే స్టేషన్ సహా మరికొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లారు. పోలీసులు అతడిని థానేలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేడు సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు.

సంబంధిత పోస్ట్