తెలంగాణలో వేసవి చర్యలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, ధాన్యం కొనుగోళ్లు, వేసవి చర్యలపై చర్చించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు ఉన్నాయన్నారు. వర్షాకాలం వచ్చే వరకు తాగునీటి సరఫరాను రోజూ పర్యవేక్షించాలని.. ధాన్యం సేకరణ కేంద్రాల్లో తాగునీరు, ORS అందుబాటులో ఉంచాలన్నారు. వడగాలుల తీవ్రతపై ప్రజలకు, సిబ్బందికి అవగాహన పెంచాలన్నారు.