కరెంట్ అఫైర్స్: భారత మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌గా నిలిచిన తెలుగమ్మాయి సహజ

82చూసినవారు
కరెంట్ అఫైర్స్: భారత మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌గా నిలిచిన తెలుగమ్మాయి సహజ
అంతర్జాతీయ సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టెన్నిస్ క్రీడాకారిణి సహజ యామలపల్లి భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. సెప్టెంబర్ 9న విడుదల చేసిన డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల సహజ ఒక స్థానం మెరుగుపడి 302వ ర్యాంక్‌కు చేరుకుంది. చాలా కాలంగా భారత్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న 31 ఏళ్ల అంకిత రైనా. 24 స్థానాలు దిగజారి 307వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో సహజ 27 మ్యాచ్‌లు గెలిచి 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

సంబంధిత పోస్ట్