ఆ యాప్స్‌లో కరెంట్‌ బిల్లులు చెల్లించలేరు. కారణం ఇదే.!

63చూసినవారు
ఆ యాప్స్‌లో కరెంట్‌ బిల్లులు చెల్లించలేరు. కారణం ఇదే.!
ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారా? అయితే ఈ నెల నుంచి విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు చేయడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలనూ నిలిపి వేయడమే కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TGSPDCL) సోమవారం ఆ మేరకు ప్రకటన చేయగా. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ సైతం (APEPDCL) తమ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని వినియోగదారులకు సూచించింది.
Job Suitcase

Jobs near you