OLA కంపెనీ వాహనాలను కొనుగోలు చేసిన కస్టమర్లు.. కంపెనీ సర్వీస్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా చెన్నైలో ఓ యూజర్ వాహనం గురించి ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదని సీరియస్ అయ్యాడు. అంబత్తూరులో ఉన్న OLA షోరూమ్ ముందు స్కూటీని తగలబెట్టాడు. కాగా ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటుంటే కొన్ని కంపెనీలు మాత్రం కస్టమర్లను ఇబ్బందులు పెడుతున్నాయనే విమర్శలొస్తున్నాయి.