బంగ్లాదేశ్‌లో విధ్వంసం..భారతీయులకు ఎంబసీ కీలక సూచన
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలు కాస్త రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఎంబసీ అక్కడున్న భారతీయులకు కీలక ప్రకటన జారీ చేసింది. భారత కమ్యూనిటీకి చెందిన పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయొద్దని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ఆయా కమిషన్స్‌ను సంప్రదించాలని వెల్లడించింది.