కేరళలోని వయనాడ్ జిల్లాలో జరిగిన విలయంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ ఉదాసీనత, దురాశ, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసమే ఈ దుర్ఘటనకు కారణమని అభిప్రాయపడింది. విపత్తుల నిర్వహణ చట్టం (డీఎంఏ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు, నిధులు తదితరాలపై మూడు వారాల్లోగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 200 మందికి పైగా చనిపోయారు. ఇంకా 119 మంది ఆచూకీ తెలియరాలేదు.