తిరుమలకు భక్తులు రావద్దు

62చూసినవారు
తిరుమలకు భక్తులు రావద్దు
వేసవి సెలవులు, పోలింగ్‌ ప్రక్రియ పూర్తవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది. ముందస్తు ప్లాన్ ప్రకారంగా దర్శనం టికెట్లు, రూమ్ బుకింగ్ వంటి సౌకర్యాలను ముందుగానే చేసుకున్న వారు రావాలని తెలిపింది. రద్దీ నెలకొనడంతో వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్