కాశీ ఆలయంలో పోలీసులకు ధోతీ-కుర్తా యూనిఫాం

74చూసినవారు
కాశీ ఆలయంలో పోలీసులకు ధోతీ-కుర్తా యూనిఫాం
కాశీ విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫాంకు బదులు ధోతీల్లో కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా ఖాకీ దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్థి పలికారు. ఇందులో భాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసుల సల్వార్ కుర్తాలను యూనిఫాంగా ధరించనున్నారు. భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్