డైరెక్టర్ అపర్ణ మల్లాది కన్నుమూత
తెలుగు డైరెక్టర్ అపర్ణ మల్లాది(45) క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. గురువారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆమె మృతి చెందారు. ఆమె నటి, రచయిత, దర్శకురాలు అంతే కాదు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అపర్ణ చేసింది తక్కువ సినిమాలే అయినా కేరాఫ్ కంచరపాలెం లాంటి సినిమాలు తెరమీదకు రావడానికి ఆమె కృషి చాలా ఉంది. అపర్ణ మల్లాది మరణంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.