పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఒక రజతం, ఐదు కాంస్య పతకాలతో 71వ స్థానంలో నిలిచింది. గత 5 ఒలింపిక్స్‌లో ఒక్కసారి కూడా టాప్-20లోకి రాలేదు. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. రియో 2016 ఒలింపిక్స్‌లో 67వ స్థానంలో, లండన్ 2012 ఒలింపిక్స్‌లో 55వ స్థానంలో, బీజింగ్ 2008 ఒలింపిక్స్‌లో 50వ స్థానంలో నిలిచింది.