సాధారణంగా క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750+ ఉంటే దాన్ని మెరుగైన క్రెడిట్ స్కోర్‌గా భావిస్తారు. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు క్రెడిట్ బ్యూరోలు ఆలస్యమైన చెల్లింపులు, రుణ బకాయిలు వంటిని పరిగణనలోకి తీసుకుంటాయి. దీని గణనలో పేమెంట్ హిస్టరీ ప్రభావం 30 నుంచి 35 శాతంగా ఉంటుంది. కాబట్టి మెరుగైన క్రెడిట్ స్కోరు కోసం చెల్లింపులు ఆలస్యం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.