ట్రావెర్నియా ఫెస్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసా...?

9844చూసినవారు
ట్రావెర్నియా ఫెస్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటో తెలుసా...?
ట్రావెర్నియా ఫెస్ట్ అనేది భారతదేశంలో జరిగే ఒక ప్రత్యేక ఉత్సవం. ఇది ట్రావెల్, టూరిజం మరియు ఇతర ప్రసిద్ధిగాంచిన సరికొత్త ప్రదేశాలు మరియు వాటి ఆధారిత అంశాలను ప్రోత్సహిస్తుంది. ఈ ఫెస్ట్‌లో దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులు, సంప్రదాయాలు, భోజనాలు మరియు కళల్ని ప్రదర్శించడం జరుగుతుంది. సందర్శకులు అనేక రకాల టూరిస్టిక్ గమ్యస్థానాల గురించి తెలుసుకునే అవకాశాన్ని పొందవచ్చు లేదా అనుభవాలను కూడా పంచుకోవచ్చు. ఈ ఉత్సవం యువత, కుటుంబాలు మరియు టూరిజం ప్రేమికులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే ఇది విశేషమైన అనుభవాలు సరికొత్త నూతన విషయాలను అందిస్తుంది.

అదేవిధంగా ట్రావెలింగ్ లేదా ఇతర సరికొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్న లేదా తెలుసుకున్న ప్రదేశాల గురించి మరికొంత మందికి తెలియజెప్పాలని ఒక కమ్యూనిటీ వలె రెడీ చేయాలని ముఖ్య ఉద్దేశ్యంగా ముందుకు సాగుతున్నారు.

Around World Magnets అనే పుస్తకాన్ని Dr.Anthony Vipin Das,
Vidushi Duggal ,
లు రచించారు...దీని అద్భుతమైన సారాంశం ఏంటంటే ఈ ఇద్దరు రచయితలు చూసిన ప్రదేశాలతో పాటు మిగతా వారి నుండి సేకరించిన సమాచారం మరియు అనుభవాలను మొత్తం ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం వలన కూడా ఎన్నెన్ని ప్రాంతాలు చూడాల్సినవి ఉన్నాయి, ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి,అక్కడి విశిష్టత ఏంటి అనే సమాచారం స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ట్రావెర్నియా ఫెస్ట్ కార్యక్రమాన్ని Dr. Antony Vipin Das, Vidushi Duggal మరియు Vikram Muday లు నిర్వహిస్తున్నారు.

ట్రావెర్నియా ఫెస్ట్‌ ఉత్సవం ద్వారా దేశంలో ఉన్న విభిన్న సంస్కృతులను మరియు విభిన్న ప్రాంతాల ప్రత్యేకతలను పంచుకోవడం జరుగుతుంది. ట్రావెర్నియా ఫెస్ట్ అనేది సమాజాన్ని ప్రోత్సహించేందుకు, సంబంధాలను బలపరచడానికి మరియు భారతదేశం యొక్క వైవిధ్యాన్ని పంచుకోవడానికి ఒక ప్రత్యేక వేదికగా పనిచేస్తుంది.

మరిన్ని వివరాలకు ఈ కింది వెబ్సైట్ ను క్లిక్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి.
www.traverniafest.com

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్